మాములుగా ఆఖరి ఓవర్లలో ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రెజర్ అంతా బౌలర్లపైనే ఉంటుంది. అది కూడా ధోని టార్గెట్ ఛేజ్ చేయాలని చూస్తున్నప్పుడు. టీ20ల్లో 20 ఓవర్ లో ధోని స్ట్రైక్ రేట్ 225. సో ఏ బౌలర్ కైనా గుండె దడదడలాడిపోతూ ఉంటుంది. కానీ సందీప్ శర్మ ధోనిని అలాంటి స్థితిలో రెండు సార్లు ఫేస్ చేసి రెండు సార్లు ధోనిని ఓడించాడు. తన టీమ్ కు విజయాలను అందించాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై గెలవాలంటే చివర్లో 20పరుగులు చేయాలి. క్రీజ్ లో మహేంద్ర సింగ్ ధోని, బౌలర్ సందీప్ శర్మ. ఎంత ఒత్తిడిలో ఉన్నాడంటే ఫస్ట్ బాల్ వైడ్ వేశాడు. ధోని కి దొరికితే కొడతాడు అని తెలుసు అందుకే ఎలాంటి బాల్స్ వేయాలా అని ఆలోచించాడు. 12ఏళ్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 130 మ్యాచుల ఎక్స్ పీరియన్స్...139వికెట్లు తీసిన అనుభవం..అన్నీ కలగలిపి ధోనికి చాలా ఇష్టమైన కొడతాడు అని కచ్చితంగా తెలిసిన లో ఫుల్ టాస్ బాల్ వేశాడు. అంతకు ముందు ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ కొట్టి ఊపు మీదున్న ధోని దాన్ని బలంగా బాదటం...ఆల్మోస్ట్ బౌండరీ లైన్ దగ్గర ముందుకు డైవ్ కొడుతూ షిమ్రోన్ హెట్మెయర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో ధోని అవుట్ కాక తప్పలేదు. ఫలితంగా మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. 6పరుగుల తేడాతో విక్టరీ కొట్టేసింది. ఇలా సందీప్ శర్మ ధోనిని మ్యాచ్ గెలవనీయకుండా ఆపటం ఇదేం మొదటి సారి కాదు. 2023 ఐపీఎల్ సీజన్ లోనూ ఇలానే చేశాడు. చెన్నైలో జరిగిన మ్యాచ్ లో అప్పుడు ధోని కెప్టెన్ గా తన 200వ మ్యాచ్ ఆడుతుంటే ఆఖరి ఓవర్ సేమ్ సందీప్ శర్మనే వేశాడు. అప్పటికే 3 సిక్సులు కొట్టి ఊపు మీదున్న ధోనిని ఆఖరి బాల్ బౌండరీకి పంపించుకుండా అడ్డుకున్నాడు సందీప్ శర్మ. ఫలితంగా రాజస్థాన్ కు 3 పరుగుల తేడాతో విజయం లభించింది. అలా రెండేళ్లలో వరుసగా రెండు సార్లు ధోనిని అడ్డుకుని రాజస్థాన్ కు విజయాలు సాధించి పెట్టాడు సందీప్ శర్మ.